ఇటు ట్విస్ట్..అటు రొమాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పక్క సాహో ప్రమోషన్స్‌ని పతాక స్థాయికి తీసుకెళ్తూనే.. మరోపక్క ఆసక్తిపెంచే అంశాలను ఫీలర్లుగా బయటకు వదులుతోంది చిత్రబృందం. బహుబలి తరువాత ప్రభాస్ చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం -సాహో. శ్రద్ధాకఫూర్ కథానాయిక. ప్రభాస్ ఫస్ట్‌లుక్ నుంచి సాహో చాప్టర్స్, టీజర్, క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్.. సాహో గేమ్స్.. ఇలా అంతకంతకూ ఆసక్తి పెంచేస్తోన్న సాహోనుంచి ‘అసలు ట్విస్ట్ ఇదే’నంటూ మరో ఆసక్తికర అంశం ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ఆ ట్విస్ట్ -ప్రభాస్‌ది ద్విపాత్రాభినయం అని. కథలో ప్రభాస్ -2వేల కోట్ల దోపిడీకి సంబంధించిన కేసును ఛేదించే అంకర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడన్నది చిత్రబృందం చెప్తోన్న మాట. అయితే, ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోన్న కథనం ఏంటంటే -ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని. గత రెండు రోజులుగా ఈ కథనం వినిపిస్తున్నా -చిత్రబృందం మాత్రం అధికారికంగా స్పందించటం లేదు. దీంతో -కథనాలు నిజమా? ప్రమోషనల్ జిమ్మిక్కా అన్న అనుమానాలూ ముసురుతున్నాయి. ఒకవేళ ప్రభాస్ కనుక ద్విపాత్రాభినయంలో కనిపిస్తే -అది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా? అన్నదమ్ములా? విలన్ టీంలో పాత్రగా కనిపిస్తాడా? ఇలా ఎవరి అంచనాలు వాళ్లు వేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న సాహోను 350 కోట్ల బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, వెనె్నల కిషోర్, అరుణ్ విజయ్, మందిరాబేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సమకూర్చిన చిత్రం ఆగస్టు 30న థియేటర్లకు రానుంది.
అటు రొమాన్స్
డైహార్డ్ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించడానికి యాక్షన్ ఎపిసోడ్సే కాదు, రొమాన్స్ సీక్వెన్సూ -సాహోలో స్ట్రాంగ్‌గానే ఉన్నాయట. బాహుబలి: కన్‌క్లూజన్ తరువాత బాగా గ్యాప్ రావడంతో -డార్లింగ్ స్క్రీన్ ప్రజెన్స్ కోసం డైహార్డ్ ప్యాన్స్ చకోరపక్షుల్లా ఎదురుచూడటం కనిపిస్తున్నదే. దానికితోడు 350 కోట్ల భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ అన్నపుడే -లోడెడ్ సీన్స్ ఎంత మెటాలిక్‌గా ఉంటాయో ఊహించేసుకున్నారు. ఆ ఊహలకు బలాన్నిస్తూ -ట్రైలర్ కట్‌తో టెంపర్ పెంచేశాడు దర్శకుడు సుజిత్. అయితే, ఫ్యాన్స్‌కి ఇదొక్కటే సరిపోదు కనుక -ప్రభాస్ స్టయిల్ రొమాన్స్‌నీ సాహోలో గట్టిగానే దట్టించినట్టు తెలుస్తోంది. ‘వయొలెన్స్. వయొలెన్స్ ఎక్కువైపోయింది. యు నో లైక్ సమ్‌థింగ్.. అంటూ నసుగుతున్న ప్రభాస్‌కు, పక్కనున్న ఫ్రెండ్ ‘రొమాన్స్’ని గుర్తు చేస్తాడు. ట్రైలర్ కట్‌లో చూపించిన ఈ డైలాగ్‌తో -అమృతానాయర్ క్యారెక్టర్ చేస్తున్న శ్రద్ధాకఫూర్‌పై ఫోకస్ పెరిగింది. ప్రభాస్ -అనుష్కశెట్టి కెమిస్ట్రీని బాగా అలవాటుపడివున్న ఫ్యాన్స్ -శ్రద్ధను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఓ పజిల్. అయితే, విడుదలైన రొమాంటిక్ పోస్టర్లు, ప్రమోషనల్ సాంగ్స్ హీట్ రేపుతున్నాయన్నది నిజం. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో, చిత్రబృందం సైతం లీడ్‌రోల్స్ మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా చూపించే పోస్టర్లను విడుదల చేయడం మొదలెట్టారు. తెలుగు తెరపై తొలిసారి కనిపిస్తున్న శ్రద్ధాకఫూర్ ప్రభాస్‌తో కెమిస్ట్రీని ఎలా పండించిందీ, అనుష్కను మర్చిపోయేంతగా అద్భుతాన్ని చేసి చూపించిందా లేదా అనేది స్క్రీన్‌పైనే చూడాలి.
రేటు పెరగొచ్చు
బాహుబలి తరువాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోన్న భారీ బడ్జెట్ సినిమా -సాహో. సినిమాకు దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ అయినట్టు ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పిన సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ చిత్రం కనుక -పెట్టుబడులు వెనక్కి తెచ్చుకునేందుకు నిర్మాతలు భారీ రేట్లకే డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరను పెంచాలన్న ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ సర్కారుని డిస్ట్రిబ్యూటర్లు కలిసి అనుమతి సాధించారని, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆ దిశగా పావులు కదుపుతున్నారని వార్తలు వినవస్తున్నాయి.