24క్రాఫ్ట్స్‌కి పని కల్పించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా పరిశ్రమలో 24 విభాగాల్లోని వర్కర్లకు పని దొరికేలా కృషిచేస్తానని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి రామకృష్ణగౌడ్ హామీనిచ్చారు. హైదరాబాద్‌లో ఆదివారం టిఎఫ్‌సిసి కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఆర్‌కె గౌడ్, ప్రధాన సలహాదారుగా ఏయమ్ రత్నం, ఉపాధ్యక్షులుగా గురురాజ్, రవీంద్రగుప్త, అలీభాయ్, కార్యదర్శులుగా కెవి రమణారెడ్డి, కె సత్యనారాయణ ఎంపికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వి మధు, పూసల కిశోర్, రవీంద్రగౌడ్, సహాయ కార్యదర్శులుగా సతీష్, నాగరాజు గౌడ్, జి శంకర్‌గౌడ్, కోశాధికారిగా రామానుజం, సభ్యులుగా వి కృష్ణారావు, హెచ్ కృష్ణారెడ్డి, అలెక్స్, ఇ సదాశివరెడ్డి, రాజునాయక్, వెంకటేష్ గౌడ్, టి శ్రీనివాస్‌గౌడ్, టి రాజేష్, ఎం వెంకటేశ్, ముఖావర్ వలి, మహాలక్ష్మి, బి నాగరాజు ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ టిఎఫ్‌సిసి భవన నిర్మాణానికి స్థల కేటాయింపు, సినీ వర్కర్ల ఇళ్ల నిర్మాణం, కల్చరల్ సెంటర్ కోసం స్థల కేటాయింపుపై చర్యలు తీసుకుంటానన్నారు.