ఇట్లు మీ శ్రీమతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాహిని టాకీస్ బ్యానర్‌పై ఎంఎస్ రెడ్డి నిర్మించనున్న చిత్రం -ఇట్లు మీ శ్రీమతి హైదరాబాద్‌లో ఆదివారం లాంఛనంగా మొదలైంది. దర్శకుడు మురళి బోడపాటి. ప్రారంభ కార్యక్రమంలో దర్శకుడు వి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. టి ప్రసన్నకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ మొదటి సన్నివేశంపై క్లాప్ కొట్టారు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ -దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో కృష్ణచంద్రను హీరోగా పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టామన్నారు. దర్శకుడు మురళి మాట్లాడుతూ -ఇట్లు మీ శ్రీమతి చిత్రాన్ని వినోదభరితంగా తెరకెక్కించనున్నట్టు చెప్పారు. హీరో కృష్ణచంద్ర మాట్లాడుతూ -మంచి స్క్రిప్ట్‌తో హీరోగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉందన్నారు. తనకు అవకాశమిచ్చిన దర్శకు నిర్మాతలకు హీరోయిన్ కరోణ్య కట్రీన్ కృతజ్ఞతలు తెలిపారు.