నీకోసం.. హిట్టవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తదనంతో అచ్చమైన ప్రేమకథలా తెరకెక్కుతోన్న ‘నీకోసం’ చిత్రానికి పవన్‌కల్యాణ్ బ్లెస్సింగ్స్ దొరికాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ను చూసిన ముగ్దుడైన పవన్, మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు పరిశ్రమకు చాలా అవసరమంటూ -ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే కొత్తవాళ్లకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందన్నారు. కానె్సప్ట్ గురించి తెలుసుకొని, చిత్ర హీరో అజిత్ రాధారాంని అభినందించారు. వైవిధ్యమైన చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు పట్టంగడతారన్న నమ్మకంతో -లవ్ కానె్సప్ట్‌తో వస్తోన్న చిత్రం నీకోసం. సెప్టెంబర్ 6న థియేటర్లకు వస్తోన్న చిత్రాన్ని నవీన్ క్రియేషన్స్ రాజలింగం సమర్పిస్తున్నారు. అరవింద్‌రెడ్డి, సుభాంగిపంత్, దీక్షితాపార్వతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.