సాహోకు యు/ఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైరేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహోకు సెన్సార్ -యు/ఎ సర్ట్ఫికేట్ ఇచ్చింది. ప్రమోషన్స్ పతాకస్థాయిలో సాగుతోన్న ఈ సినిమా ఆగస్టు 30న థియేటర్లకు రానున్న విషయం తెలిసిందే. తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఫస్ట్‌లుక్ నుంచి ట్రైలర్ వరకూ ఓ రేంజ్ ప్రమోషన్స్ సాగుతుండటంతో -ఆడియన్స్ అటెన్షన్ మొత్తం ఇప్పుడు సాహోపైనే ఉంది. సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపడంతో -ఈ హాలీవుడ్ రేంజ్ సినిమాకు మరింత ఊపొచ్చింది. ‘గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది..’ అంటూ ప్రభాస్ డైలాగ్ జనాల్లోకి దూసుకుపోవడంతో -డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పనిచేసిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. శ్రద్ధాకపూర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేసింది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీష్రాఫ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ అభిమానులకు పండగలాంటి సినిమా అంటూ దర్శకుడు సుజీత్ మాటిచ్చాడు.