డింపుల్ డేస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డింపుల్ హయతి. రెండేళ్లలో రెండు తెలుగు సినిమాలు చేసినా -ఆమెవరో ఆడియన్స్‌కి తెలీదు. 2017లో గల్ఫ్ అంటూ ఓ సినిమా చేసింది. ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయింది. తరువాత చేసిన యురేకా సైతం ఆమె ఫేట్‌ను మార్చలేకపోయింది. ఆ తరువాత ప్రభుదేవా -తమన్నా కాంబోలో వచ్చిన అభినేత్రి 2లో ఆమె చేసిన పాత్ర మంచి పేరు తెచ్చింది. ఇప్పుడిక ఆమె దశ తిరిగిందనే అంటున్నారు సినీజనాలు. తమిళ జిగర్తాండకు రీమేక్‌గా వస్తోన్న వరుణ్‌తేజ్ ‘వాల్మీకి’లో జర్ర జర్ర అంటూ ఆమె చేసిన మాస్ సాంగ్‌లో హయతి మెరుపులు మెరిపించింది. సినిమా ప్రొమోగా వచ్చిన బిట్‌లోనే ఆమె గ్లామర్ ఔరా అనిపించటంతో -కన్నడ సినిమాకు ఓ చాన్స్ వచ్చిందట. కన్నడ దర్శకుడు చంద్రవౌళి తెరకెక్కించనున్న తాజా ప్రాజెక్టులో ఓ ఇండిపెండెంట్ రోల్‌కు డింపుల్‌ను తీసుకున్నట్టు టాక్. ఆ పాత్రను పండించేందుకు డింపుల్ కన్నడ నేర్చుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇటు తెలుగులోనూ -శేఖర్ కమ్ముల దృష్టిలో పడినట్టు వార్తలొస్తున్నాయి. కమిలినీ ముఖర్జీ, తమన్నా, సాయిపల్లవికి ఓ రేంజ్ లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల -డింపుల్‌ను ఎంత హైట్స్ తీసుకెళ్తాడోనన్న చర్చా లేకపోలేదు. సో, వచ్చేవన్నీ డింపుల్ డేస్ అన్న మాట.