వెరీ సింపుల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై తమిళ కథలు -కాసులు కురిపిస్తున్నాయి. రీమేక్‌గా ఇటీవలి కాలంలో స్క్రీన్స్‌కు వచ్చిన మూడు కథలు -్భవిష్యత్ తమిళ ప్రాజెక్టులపై ఆశలు పెంచుతున్నాయి. అందుకే -తెలుగులో సరైన కథ కుదరడం లేదంటే, తమిళంవైపు చూడ్డంలో తప్పులేదంటున్నారు మేకర్స్. ఇక్కడ -తెలుగులో కథలు కరవయ్యాయా? రచయితల మెదళ్లు మొద్దుబారాయా? అంటూ మస్తిష్కంలో మెదిలే పాచి ప్రశ్నలు వృధా. మంచి కథను మనోళ్లకూ చూపించొచ్చన్న ఆలోచనే ప్రధానం. ఆ ప్రయత్నానికి ఆడియన్స్ కనెక్టైతే -కాసులు కురుస్తాయన్న ఆశలే ప్రాధాన్యం. జస్ట్ -ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్.
ఇక్కడ ఓ పెద్ద దర్శకుడు ఎప్పుడూ చెప్పే మాట గుర్తు చేసుకోవచ్చు. ‘మంచి వంటకం కావాలంటే ముడిసరుకు మంచిదైతే సరిపోదు. దాన్ని సమపాళ్లలో కలిపే నేర్పూ, ఓర్పూ ఉండా’లంటాడాయన. సినిమాను ఉద్దేశించే ఆ మాట చెప్పాడు కనుక -మంచి కథ ఒక్కటే సరిపోదు. రుచిగా వడ్డించేందుకు సమపాళ్లలో కలిపే టెక్నిక్, టైం కూడా కలిసి రావాలన్నది ఇప్పటి మాట. ఈ కోణంలో తెలుగుకు వస్తున్న తమిళ చిత్రాల్ని, తమిళానికి వెళ్తున్న తెలుగు చిత్రాల్నీ ఏ ఆడియన్సూ తక్కువ చేసి చూడాల్సిన పని లేదన్న వాతావరణం ఆవిష్కృతమైంది. కాకపొతే -ఇటీవలి కాలంలో తమిళంలో వస్తోన్న కథలు, వాటి కథనాలు, వాళ్లు కలుపుతున్న పాళ్లకు -తెలుగు ఆడియన్సూ బలంగా కనెక్టవుతున్నారని చెప్పడానికి మూడు కథల్ని ప్రస్తావించొచ్చు.
కొద్దికాలం క్రితం తమిళంలో ‘రాచ్ఛసన్’ ఓ సెనే్సషన్. ఇదే కథను మనదగ్గరున్న మెటీరియల్‌తో వర్కౌట్ చేయొచ్చన్న ఆలోచన వచ్చాక తయారైన రీమేకే -రాక్షసుడు. సినిమా అక్కడ హిట్టవ్వడం, క్రైం థ్రిల్లర్ అనే యూనివర్శల్ లైన్‌తో వచ్చిన కథను తెలుగు ఆడియన్సూ ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం.. అలా రాక్షసుడు రూపుదిద్దుకుంది. కెరీర్‌కు సరైన బ్రేక్‌లేక అల్లాడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఆ రీమేకే వరమైంది. ఒరిజినల్ టెంపోను ఏమాత్రం డిస్ట్రర్బ్ చేయకుండా -తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్‌కు కథను కనెక్ట్ చేయడంలో దర్శకుడు రమేష్‌వర్మ పనితనం రీమేక్ స్టయిల్‌కు ప్లస్సైంది. వెరసి -తొలి సినిమాతోనే నిర్మాత కోనేరు సత్యనారాయణకు కోట్లుగడించే అవకాశం వచ్చింది. అఫ్‌కోర్స్ -ఇది పాస్ట్.
ఇప్పుడు థియేటర్లలో మంచి టాక్‌తో నడుస్తోన్న మరో సినిమా -కౌసల్య కృష్ణమూర్తి. ఇదీ తమిళం నుంచి తీసుకున్న కథే. తమిళంలో శివకార్తికేయన్ తొలిసారి నిర్మాతగా, పాటల రచయిత అరుణ్‌రాజా కామరాజా తొలిసారి దర్శకత్వ బాధ్యతలతో తెరకెక్కించిన సినిమా ‘కణ’. స్వాభిమాన వ్యవసాయానికి, సొంతం చేసుకున్న క్రికెట్ క్రీడకు లింకుపెట్టి ఎమోషన్స్‌ని స్క్రీన్‌పై చూపించిన సినిమా. స్క్రీన్‌మీది భావోద్వేగాలన్నీ తెలుగు ఆడియన్స్‌కి బలంగా కనెక్టవుతాయన్న నమ్మకంతో -‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేకైంది. ఆ నమ్మకమైతే వమ్ముకాలేదు. సంతృప్తికరమైన ఫలితాలు అందే అవకాశాలే కనిపిస్తున్నాయి. తమిళంలో లీడ్‌రోల్ చేసిన ఐశ్వర్య రాజేష్‌లోని తెలుగుదనం, ఎమోషన్స్‌ని ఆడియన్స్ మైండ్‌లోకి పూర్తిగా ఇంజెక్ట్ చేయగల రాజేంద్రప్రసాద్ నట సామర్థ్యం.. -రెండూ సినిమాను ఓ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రీమేక్‌ల సిద్ధహస్తుడు, కెరీర్‌లో ఎక్కువ రీమేక్ సక్సెస్‌లే కొట్టిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు -మాతృకను దెబ్బతీయకుండా తనదైన సున్నితత్వాన్ని బలంగా చూపించటం సినిమాకు పెద్ద ప్లస్సైంది. సమర్పకుడు కెఎస్ రామారావు ప్లానింగూ ఈ ప్రయత్నంలో పెద్ద భాగం కావడంతో -చర్చించుకోదగ్గ ఫలితం అందే పరిస్థితి కనిపిస్తోంది. ఇది -వర్తమానం.
సెలెక్టెడ్ స్టోరీస్‌తో -వ్యక్తిగత ఇమేజ్ గ్రాఫ్‌ను క్రమంగా పెంచుకుంటూ వస్తున్న హీరో వరుణ్‌తేజ్. ఒక్కసారిగా ఊరమాస్ అప్పియరెన్స్‌తో సెంటర్ అట్రాక్షన్ సినిమా చేస్తున్నాడు. దాన్ని తెరకెక్కిస్తున్నది దర్శకుడు హరీశ్ శంకర్. టైటిల్ -వాల్మీకి. కథకు మూలం -తమిళ జిగర్తాండ. తమిళ నటులు సిద్ధార్థ, బాబీ సింహాను ప్రధాన పాత్రలుగా చూపిస్తూ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన రెండో సినిమా. దర్శకుడి స్టామినాకు, -మ్యూజికల్ గ్యాంగ్‌స్టర్ జోనర్‌కు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. బెస్ట్ సపోర్టింగ్, బెస్ట్ ఎడిటింగ్ క్యాటగిరీ కింద జాతీయ అవార్డులూ జిగర్తాండకు అందేశాయి. తెలుగు రీమేక్‌లో -సిద్ధార్థ పాత్రను అధర్వ చేస్తుంటే, బాబీసింహా పాత్రను వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. హరీశ్ శంకర్ టేకింగ్ స్టయిల్, గుర్తుపట్టలేనంతగా వరుణ్ తేజ్ ఊరమాస్ మేకోవర్, ఎక్స్‌ప్రెషన్స్.. పూజా హెగ్దె గ్లామర్, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. వెరసి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. వాల్మీకి కనుక ఆడియన్స్‌లోకి చొచ్చుకుపోతే -సీజన్ మొత్తం తమిళ కథలదే. ఇది -్భవిష్యత్!
***
చిత్రమేమంటే -అనువాదాలు, పునర్మిర్మాణాలు సులువైన తరువాత.. ఏ భాషలో తయారవుతున్న సినిమాలైనా అందుకు అనుగుణంగానే రూపుదిద్దుకుంటున్నాయి. యూనివర్శల్ థాట్ నుంచి కథ పుట్టించటం, తదనుగుణంగా స్క్రీన్‌ప్లే.. రీమేక్/ అనువాదానికి అనుకూలంగా మేకింగ్.. ఇలా సినిమా సిద్ధమవ్వడమే ఈ కోణంలో జరుగుతోంది. తమిళ చిత్రాన్నో, తెలుగు సినిమానో రీమేక్ చేసుకోవాలంటే -40 నుంచి 50 శాతం సినిమాను మళ్లీ షూట్ చేసుకుంటే చాలు. మిగతా 50శాతం మాతృకను యథాతథంగా వాడుకునే అవకాశాన్ని కల్పిస్తూ సినిమా నిర్మిస్తున్నారంటే -ప్రక్రియపై ఎంత ఫోకస్ పెరిగిందో అర్థం చేసుకోచవ్చ.
హైటెన్షన్ బడ్జెట్ సినిమాలు ఎలాగూ ఆయా భాషల్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇక మీడియం, చిన్న సినిమాలను ఆయా భాషల్లో విడుదల చేయడంకంటే, రీమేక్ హక్కుల్ని అమ్ముకోవడమే ఉత్తమమైన మార్గంగా కనిపిస్తోంది. సో, అందుకు అనుకూలంగానే మేకర్స్ సైతం సినిమాను తెరకెక్కించే ప్రణాళికలు చేస్తున్నారన్నది నిజం. సో, భవిష్యత్‌లో రీమేక్‌ల రాజ్యం మరింత బలపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

-ప్రవవి