వెల్లువెత్తిన అభిమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ హీరో చిరంజీవి జన్మదిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. 64ఏళ్ల చిరంజీవి సుదీర్ఘంగా పరిశ్రమలో కొనసాగుతూ సాధారణ స్థాయి నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదగడాన్ని అభిమానగణం గుర్తు చేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ అసమాన శక్తితో అద్భుత చిత్రాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికపై నిర్వహించిన చిరు బర్త్ డే ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్, కల్యాణ్ దేవ్, కె వెంకటేశ్వర రావు, చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ -చిరు అభిమానుల్లో తనూ ఒకడిగా వచ్చానని, నా జీవితానికి స్ఫూర్తిప్రదాత అన్నయ్యేనంటూ శుభాకాంక్షలు ప్రకటించారు. ఇదొక ప్రత్యేకమైన సందర్భమని, ఓ అభిమానిగా ఎలాంటి పాత్రలో చిరంజీవిని చూడాలనుకున్నానో -అదిప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తీరబోతోందన్నారు. ఫ్యాన్స్ ఈవెంట్‌గా నిర్వహించిన కార్యక్రమంలో చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్ పెద్దఎత్తున సాగాయి. ఇదిలావుంటే, -గురువారం సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని ప్రకటిస్తూ -హీరోలు, దర్శకులు, నిర్మాతలు, చిత్రబృందాలు, రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రితోవున్న ఫొటోను హీరో రామ్‌చరణ్ పోస్ట్ చేస్తూ -లక్షలాదిమంది చిరు ఫ్యాన్స్‌లో నేనూ ఒకడిని. కాకపోతే ఆయన్ని అప్పా అని పిలుస్తానంతే’ అని కామెంట్ పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ భాషా చిత్రాల హీరోలు, హీరోయిన్లు, చిత్ర ప్రముఖులు సైతం చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ -సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.