అతిపెద్ద సాహో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భారీ బడ్జెట్.. భారీ తారాగణం.. సుదీర్ఘ చిత్రీకరణ.. హాలీవుడ్‌ని తలదనే్న హై క్వాలిటీ.. ఇలా సాహో ప్లస్‌లకు మరో ప్లస్ యాడైంది. అది సినిమా రన్‌టైం. సాహో నిడివి సైతం భారీగానే అనిపిస్తోంది. లోడెడ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన సాహో -సెన్సార్ పూరె్తైన తరువాత 2.54 గంటల రన్టైమ్తో లాకైందని అంటున్నారు. తాజాగా సెన్సార్ నుంచి యు/ఎ సర్ట్ఫికెట్ అందుకుంది సాహో. ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో బాహుబలి తరువాత సాహోనే కనిపిస్తోంది. ‘బాహుబలి’తో తన రేంజ్‌ను పెంచిన హీరో ప్రభాస్, తరువాతి ప్రాజెక్టుగా సాహోతో వస్తుండటంతో అంచనాలు అంతకంతకూ మించుతున్నాయి.
రూ.350 కోట్లతో రూపొందిన చిత్రం కావటంతో -సహజంగానే అట్రాక్షన్ పాయింట్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తే, జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీపాండే, అరుణ్‌విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు తీర్చిదిద్దిన చిత్రంగా సాహో ఆగస్టు 30న థియేటర్లకు వస్తోంది.
ఆమెకు అలా చెప్తా..
సాహో ప్రమోషన్స్ కోసం బయటికొచ్చిన ప్రభాస్‌ను -అనుష్కతో డేటింగ్లో ఉన్నారా? అన్న ప్రశ్నలు మళ్లీ వెంటాడుతున్నాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ తరచూ మీడియానుంచి, అభిమానుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నతో ప్రభాస్‌కు ఇబ్బంది తప్పడం లేదు. తాను, అనుష్క కేవలం స్నేహితులమేనంటూ ఇప్పటికే కొన్ని వందలసార్లు చెప్పాడు ప్రభాస్. ఇంకా చెబుతూనే ఉన్నాడు కూడా. అయినా అనుష్కతో డేటింగ్ వదంతులకు ఫుల్స్టాప్ పడటం లేదు. ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమంలో ప్రభాస్‌కు తాజాగా మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది. విసిగిపోయిన ప్రభాస్ ఈ ప్రశ్నకు కాస్త తీవ్రంగానే స్పందించాడు. ‘వదంతులకు ఫుల్స్టాప్ పడాలంటే అనుష్క అయినా త్వరగా పెళ్లి చేసుకోవాలి. లేదా నేనన్నా ఓ ఇంటివాడినైపోవాలి’ అనేశాడు. అంతేకాదు, ‘ఈసారి అనుష్క కలిస్తే త్వరగా ఎవర్నో ఒకరిని చూసుకుని పెళ్లి చేసుకోమని చెబుతా. అప్పుడైనా వదంతుల ఆగుతాయి. నిజంగానే రిలేషన్షిప్లో ఉంటే, దాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఇదీ నమ్మకపోతే నేనేం చేయలేను. నాకు త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటున్నట్టున్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు ప్రభాస్.