దేనికైనా.. టైం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై గత కొద్దిరోజులుగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. డైహార్డ్ ప్యాన్స్ సైతం ప్రభాస్ పెళ్లి విషయంలో అమితాసక్తి చూపుతున్నారు. ‘సాహో’ ప్రమోషన్స్‌లో బిజీగావున్న ప్రభాస్ వద్ద మీడియా పెళ్లి ప్రస్తావన తెస్తూనే ఉంది. అంతే చిత్రమైన సమాధానాలను ప్రభాస్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా.. పెళ్లెప్పుడంటూ మళ్లీ మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానమిస్తూ -పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు’ అంటూ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. సాహో కోసం వంద కోట్ల పారితోషికం తీసుకున్నారట? అంటూ మరో ప్రశ్న సంధించినపుడు ‘నా స్నేహితుడే సినిమా నిర్మాత. ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టాం. సినిమాలోని ఓ భాగం బడ్జెట్ నా పారితోషికం’ అంటూ సమాధానమిచ్చాడు. సుజిత్ తెరకెక్కిస్తోన్న 300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. నీల్‌నితిన్ ముఖేష్, జాకీష్రాప్, వెనె్నల కిశోర్, అరుణ్ విజయ్, మందిరాబేడి తదితర స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌పై తెరకెక్కుతోన్న చిత్రానికి జిబ్రాన్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ ఆగస్టు 30న సినిమా థియేటర్లకు వస్తోంది.