ఎగిరి గంతేశాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల సాకారమైతే కలిగే ఆనందంలో ముఖం ఎంత వెలుగులు జిమ్ముతుందో ఆలియాభట్ ఫేస్ చూస్తే అర్థమవుతుంది. కారణం ఆమెకు -బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజల్‌లీలా భన్సాలీ ఇన్నాళ్లకు అవకాశమిచ్చాడట. ‘ఎప్పటికైనా భన్సాలీ డైరెక్షన్‌లో సినిమా చేయాలన్నది నా కల’ అంటూ అనేక సందర్భాల్లో ఆలియా చెబుతూనే ఉంది. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరుతోందన్న మాట. సల్మాన్ ఖాన్‌తో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించనున్న తాజా చిత్రం -ఇన్‌షా అల్లా. సల్మాన్ సరసన ఆలియాను అనుకుని, అదే విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి చెప్పిందట చిత్రబృందం. ఈ విషయాన్ని మీడియా వద్ద గుర్తు చేసుకుంటూ ‘్ఫన్ వచ్చిన సమయానికి నేను ఫారిన్‌లో ఉన్నా. ఇన్‌షా అల్లా ప్రాజెక్టుకు నన్ను తీసుకున్న విషయాన్ని చెప్పగానే ఎగిరి గంతేశాను. కొద్ది నిమిషాలపాటు పైకీ కిందకీ గెంతుతూ ఆనందాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కథ బాగా నచ్చింది. పైగా భన్సాలీ డైరెక్షన్‌లో వస్తోంది. ఆ ఆనందాన్ని ఎలా చెప్పాలి’ అంటోంది ఆలియా భట్. అంతేకాదు, సల్మాన్‌తో ఆలియా తొలిసారి తెర పంచుకుంటోంది. ప్రస్తుతం జక్కన్న చెక్కుతోన్న ట్రిపుల్ ఆర్‌తోపాటు, బ్రహ్మాస్త్ర, తఖ్త్ చిత్రాలతో ఆలియా భట్ బిజీగా ఉంది.