20న సైరా టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా -సైరా. 151వ సినిమాగా చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. సినిమా టీజర్‌ను చిరు పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేస్తారన్న కథనాలు నిన్నటి వరకూ వినిపించాయి. అయితే, నిర్మాత రామ్‌చరణ్ టీజర్ రిలీజ్ డేట్‌ను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. ఆగస్టు 20న సైరా టీజర్ బయటకు రాబోతోంది. టీజర్‌కు ఇక రెండు రోజులే ఉందంటూ ఓ అట్రాక్టివ్ పోస్టర్‌ను సైతం షేర్ చేశాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై ‘సైరా’ను దర్శకుడు సురేందర్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మంగా రూపొందించాడు. బాలీవుడ్, సౌత్ స్టార్ ఆర్టిస్టులు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పెషల్ అట్రాక్షన్‌గా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్స్‌లోవున్న ఈ సినిమా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున థియేటర్లకు రానుంది.