సైరాకు స్పెషల్ ‘పవర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నకు తమ్ముడు తోడయ్యాడు. చారిత్రక వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తనగొంతుతో పరిచయం చేశాడు. ఆవిధంగా ఆడియన్స్ -చిటికెన వేలు పట్టుకుని చిత్ర కథలోకి తీసుకెళ్లే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఈ చిత్రం సోషల్ మీడియా వెదికనెక్కిన దగ్గర్నుంచీ -‘స్టార్’ ఫ్యాన్స్ ఆనందంతో చిందులేస్తున్నారు. చిరంజీవి 151వ ప్రతిష్ఠాత్మక సినిమా -సైరా. నరసింహారెడ్డి ఉద్యమ చరిత్రగా తెరకెక్కిన చిత్రానికి గొంతునిచ్చి -స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు పవన్ కల్యాణ్. సైరా టీజర్‌కి కొద్ది రోజుల ముందే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పాడట. తమ్ముడు తన చిత్రానికి భావోద్వేగ స్వరాన్నిస్తుంటే, అన్న చిరంజీవి పక్కనే నిలబడి ఆసక్తిగా చూస్తున్నాడు. బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఇది. అంటే -చారిత్రక వీరుడి పరిచయ వాఖ్యాలు పవన్ గొంతులో వింటామన్న మాట. సొంత బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తోన్న సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ఇద్దరూ కలిసి కనిపించి మురిపిస్తే, ఇప్పుడు అన్న సైరాకు తమ్ముడు వాయిస్‌నిచ్చి మరోసారి ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్నాడు.