ఛాన్స్‌కొట్టిన ధన్సిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కబాలి’ సినిమాలో రజనీ కూతురు సాయి ధన్సిక గుర్తుందిగా. మాఫియా గ్యాంగ్‌కి చెందిన వ్యక్తిగా ఆమె పెర్ఫార్మెన్స్ మాటల్లో చెప్పలేం. అందం, ఆహార్యం, అభినయం మూడూ కలగలిసిన ధన్సిక -యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, హీరోయిన్‌గా మంచి ఛాన్స్‌కోసం ఎదురు చూస్తున్న ధన్సికకు -ఆమె టైం రానేవచ్చింది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా ‘లాబమ్’ రూపొందుతోంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే శృతిహాసన్ కుదురుకుంది. మరో హీరోయిన్‌గా సాయి ధన్సికను ఎంపిక చేసినట్టు సమాచారం. విజయ్ సేతుపతి సొంత బ్యానర్‌లో నిర్మితమవుతోన్న సినిమా వచ్చే ఏడాది ఆరంభలో విడుదల కావొచ్చట. ఇమాన్ సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. సో, అన్నీ కలిసొచ్చి సినిమా వర్కౌటైతే -్ధన్సిక స్టార్ తిరిగినట్టే.