రాక్షసుడు ఓ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ లీడ్‌రోల్స్‌లో దర్శకుడు రమేశ్‌వర్మ తెరకెక్కించిన ‘రాక్షసుడు’ సక్సెస్ ఇంపాక్ట్ ఇంకా టీంని ఆనందంలో ముంచెత్తుతోంది. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన సినిమా సక్సెస్ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ -‘రాక్షసుడు’ సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్. మీడియం రేంజ్ బడ్జెట్‌లో సినిమా నిర్మించినా -మంచి వసూళ్లనివ్వడం హ్యాపీగా ఉంది. తొలివారంలో వర్షం కారణంగా వసూళ్లు మందగించినా -క్రమంగా సినిమా అందుకుంది. ఆరంభంనుంచే లాభాలతో మొదలైనా -వాన అంతరాయం లేకుండా వసూళ్ల సునామీ సాగేది. రిపీటెడ్ ఆడియన్స్‌తో ఇప్పటికీ సినిమా మంచి టాక్‌తో నడుస్తోంది. ఇలాంటి సినిమా నిచ్చిన దర్శకుడు రమేశ్‌వర్మ, నిర్మాత కోనేరు సత్యనారాయణ, సినిమా టీం, టెక్నీషియన్లు అందరికీ కృతజ్ఞతలు అన్నారు. సక్సెస్ టూర్‌పై 15 తరువాత ఆలోచన చేస్తామన్నారు. సాయితో మరోసారి కమర్షియల్ సినిమా చేసే ఆలోచన ఉందని, అయితే ఇంతకుముందు సాయితో సినిమాలు చేసిన నిర్మాతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నారు. మల్టీ డైమన్షన్ వాసు మాట్లాడుతూ -తమిళంలో రాచ్చసన్ ఇంపాక్ట్‌కు మించి తెలుగు రాక్షసుడు ప్రభావం చూపిందన్నారు. సినిమా కోసం ప్రతిఒక్కరూ కష్టపడ్డారని, కలెక్షన్స్ రూపంలో ప్రేక్షకులు ఫలితానిచ్చారన్నారు. దర్శకుడు రమేశ్‌వర్మ మాట్లాడుతూ -్ఫస్ట్‌వీక్‌లో సినిమా కొంచెం డల్ అయినపుడు భయపడ్డామని, ఆ భయాలను వెనక్కి నెట్టేస్తూ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయ్యిందన్నారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ -సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లిన మీడియాకు ముందు థాంక్స్. 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సేఫ్ అయ్యారు. నా ప్రయత్నం ఫలించినందుకు, కష్టానికి తిగిన ఫలం అందినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకూ నా స్టయిల్‌కి భిన్నంగా చేసిన సినిమా. కాప్‌గా అండర్ ప్లే చేయడం నాకూ కొత్తనిపించింది. నిజానికిదో ఎక్స్‌పెరిమెంట్‌లానే భావిస్తున్నా అన్నాడు.