నిద్రలేకుండా పని చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడివి శేష్, రెజీనా కాసాండ్ర, నవీన్‌చంద్ర ప్రధాన తారాగణంగా పీవీపీ సినిమాపై వెంకట్ రాంజీ తెరకెక్కించిన థ్రిల్లర్ -ఎవరు. పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అనె్న నిర్మాతలు. ఆగస్ట్ 15న సినిమా విడుదలవుతోన్న సినిమాకు మంగళవారం ప్రీ రిలీజ్ నిర్వహించారు. కార్యకమంలో హీరో అడివి శేష్ మాట్లాడుతూ -ఏ సినిమాకీ లేనంతగా నిద్రను మర్చిపోయి మరీ ఎవరు? కోసం కష్టపడ్డాను. నిన్ననే వెనె్నల కిషోర్, మరికొందరు మిత్రులతో మళ్లీ సినిమా చూశాం. సినిమా చూస్తున్న ప్రతిసారీ ఎంజాయ్ చేస్తున్నాం. కిషోర్ సినిమా చూసి హగ్ చేసుకోవడం నాలో కాన్ఫిడెంట్ పెంచింది. ఇండస్ట్రీకి సంబంధంలేని వెయ్యిమందికి సినిమా చూపించి, మాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ నుంచి సినిమాను బెటర్ చేస్తూ వచ్చాం. నేను 2.0 అప్‌గ్రేడ్ వర్షన్ అన్నంతగా ఫీలై క్షణం, అమీతుమీ, గూఢచారి సినిమాలు చేశా. ఇప్పుడు ఎవరు? అందరికీ నచ్చుతుందన్న కాన్ఫిడెంట్‌తో ఉన్నా అన్నారు.
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ -క్షణం సినిమా నుంచి నా జర్నీ శేష్, పీవీపీ బ్యానర్‌తో మొదలైంది. మంచి పెర్ఫార్మెన్స్, ట్విస్టులతో సినిమా నాదగ్గరకు వచ్చినపుడు ఓ చాలెంజ్‌గా తీసుకున్నా. నేను ఇప్పటి వరకూ చేసిన చిత్రాల్లో ఇదే టఫ్. రాంజీ, శేష్ చాలా ట్విస్టులతో వచ్చారు. రెజీనా, నవీన్ కిల్లింగ్ పెర్ఫార్మెన్స్. అలాంటి ప్రాజెక్టులో నేను పార్ట్ కావడం హ్యాపీగా ఉంది అన్నారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ -అంతా ఎంకరేజ్ చేస్తుంటే పాజిటివ్ వైబ్స్‌తో ఉన్నాం. పీవీపీకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీడం లేదు. నేను ఆర్టిస్ట్ కాకముందు స్కూల్స్‌లో డ్యాన్స్ టీచర్‌గా పని చేశా. దర్శకుడు రాంజీ కూల్ పర్సన్. నా పాత్రను చాలెంజింగ్‌గా తీర్చిదిద్దారు. ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. మ్యూజిక్‌తో సినిమాను శ్రీచరణ్ మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు అన్నారు. రెజీనా కాసాండ్రా మాట్లాడుతూ -‘నిర్మాత పీవీపీ ఫోన్ చేసిన తరువాత దర్శకుడు రాంజీ, శేష్ వచ్చి కథ చెప్పారు. కథ నచ్చటమే కాదు, గ్రేట్ టీంతో పని చేసిన ఫీలింగ్ కలిగింది. నా సామ్ లుక్‌నే కాదు, పాత్రనూ అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు అన్నారు. నిర్మాత పీవీపీ మాట్లాడుతూ -రెండేళ్ల జర్నీ ఇది. టీమ్‌లో అంతా తమను తాము ప్రూవ్ చేసుకోవాలన్న ఆకలతో ఉన్నారు. సినిమా గురించి నేను మాట్లాడటం కంటే, ఆడియనే్స మాట్లాడతారు. తెలుగు సినిమా కొత్తపుంతలు తొక్కుతుంది. మంచి సినిమాల జాబితాలో ‘ఎవరు?’ భాగమవుతుంది. నమ్మకంగా ఉన్నాం అన్నారు