షాకిచ్చిన పూరి, విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్మార్ట్ హిట్టు మూడ్‌లో ఉన్నాడు పూరి జగన్నాథ్. డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్‌తో ఒకింత పెయిన్‌లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. అకస్మాత్తుగా ప్లస్ మైనస్ కాంబో ప్రకటన వెలువడటంతో -్ఫ్యన్స్ మాత్రం కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇది నిజమేనా? అన్న సంశయాన్ని వ్యక్త చేస్తున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రాబోతోంది. షాకింగ్ న్యూస్‌కి సాక్ష్యమిది. అంతేకాదు, నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది కూడా. క్రేజీ కాంబోలో సినిమా వస్తోందంటూ -పూరి, విజయ్, ఛార్మి కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. పూరీ, ఛార్మి సంయుక్తంగా సినిమా నిర్మిస్తున్నారు. ఈ కాంబో నిజంగానే సర్‌ప్రైజ్ అంటూ -్ఫ్యన్స్ అప్పుడే ట్వీట్లు మొదలెట్టారు. సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు పోస్టవుతున్నాయి. వరుస ఫ్లాపులతో సతమతమైన పూరి, ఇస్మార్ట్ శంకర్‌తో తన స్టామినా చూపించి హిట్టందుకున్నాడు. ఈమధ్యే ‘డియర్ కామ్రేడ్’తో ఆడియన్స్ ముందుకొచ్చాడు విజయ్. ఆ సినిమా తరువాత తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై తెరకెక్కిస్తున్న ‘హీరో’లో విజయ్ నటించాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది కూడా. అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు ఆగినట్టు కథనాలు వెలువడుతుండటం, అకస్మాత్తుగా పూరి-విజయ్ జట్టు కట్టడం.. ఇదంతా చూస్తున్న అభిమానులు మాత్రం ‘ఏం జరుగుతోంది’ అంటూ కన్ఫ్యూజన్‌లో పడ్డారు.