తుది షెడ్యూల్‌లో బ్రహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం తెలుగు తెరపై వేసవికి రానున్న చిత్రాల భారీ క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాలతో రాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సిలో మొదలుకానుంది. ఐదురోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ఓ పాటతోపాటుగా ప్యాచ్‌వర్క్ సన్నివేశాలు చిత్రీకరణ జరగనుంది. కుటుంబ కథా చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆకట్టుకునే భావోద్వేగాల కథనంతో రూపొందిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ఆడియో వేడుకను మే 1న తిరుపతిలో భారీగా జరపనున్నారట. సినిమాను మే నెల రెండవ వారంలో విడుదల చేస్తారు. పి.వి.పి సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కాజల్, సమంత, ప్రణీత కథానాయికలు నటిస్తున్నారు.