ప్రేమ నేపథ్యంతో కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోధ, హర్షిత జంటగా రవికిరణ్ దర్శకత్వంలో ఎస్.ఆర్. మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాతలు చిక్కా సత్యనారాయణ, మత్తి రత్నాకర్‌లు నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్‌నివ్వగా, నిర్మాత సురేష్ కొండేటి కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- మంచి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనుకున్న టైమ్‌లోగా షూటింగ్ పూర్తిచేసి మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ- మా తొలి సినిమా ‘ఆమె కోరిక’ త్వరలోనే విడుదలవుతోందని, ఇది రెండవ చిత్రమని, లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాను 35 రోజులపాటు సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేస్తామన్నారు. దర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ, దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలని అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమా సామాజిక అంశంతో ముడిపడి వుంటుందని, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా కథనం సాగుతుందని, ఈ చిత్రంలో ఐదు పాటలుంటాయని, ఈనెల 27 నుండి పది రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరిపి ఆ తరువాత భీమవరంలో చిత్రీకరిస్తామని అన్నారు.