జూన్‌లో కబాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కబాలి’. ఇప్పటికే టాకీ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఈ సినిమా విడుదలపై దర్శక నిర్మాతలు సందిగ్ధంలో వున్నారు. నిజానికి మేలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని జూన్‌కు పొడిగించినట్లు తెలుస్తోంది. మలేసియా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగస్టర్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే, ధన్సికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మే 1 విడుదల చేస్తారట. తెలుగు, తమిళంలో రూపొందుతున్న కబాలి జూన్ మొదటివారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.