అజహర్‌పై ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి అందాలు ఆరబోసిన గ్లామర్ భామ నర్గిస్ ఫక్రికి పెద్దగా సినిమా అవకాశాలు లేవు. మరోవైపు సక్సెస్ రేట్ కూడా తక్కువగా వున్న ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడంలేదు. ఆమధ్య సల్మాన్‌తో నటించిన కిక్ చిత్రంలో మెరిసినప్పటికీ లాభం లేకుండా పోయింది. మరోవైపు స్కిన్ షోకు ఎలాంటి అభ్యంతరం చెప్పని ఈమె ప్రస్తుతం అజహర్‌పైనే ఆశలు పెట్టుకుంది. అజహరుద్దీన్ జీవిత కథతో తెరకెక్కుతున్న అజహర్ చిత్రంలో ఇమ్రాన్ హష్మి సరసన నటిస్తోంది. అజారుద్దీన్ నిజ జీవితంలో రెండో భార్య అయిన సంగీతా బిజిలానీ పాత్రలో ఈమె నటిస్తోంది. ఈమె పాత్ర సినిమాకి కీలకం కానుందట. మరోవైపు హాట్‌గా కనిపిస్తూ, స్పెషల్ సాంగ్‌లు కూడా చేస్తోంది. మొత్తానికి అజహర్ చిత్రంతో అందరినీ తనవైపు లాక్కోవాలనే ప్రయత్నాల్లో వుంది. మరి ఈమె కెరీర్‌ను అజహర్ ఏ తీరం చేరుస్తాడో చూడాలి!

చిత్రం నర్గిస్ ఫక్రి