ఎన్టీఆర్ పెయిర్ ఎమ్మా రాబర్ట్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ బ్యూటీలు హాలీవుడ్ చాన్స్‌ల కోసం ఎగబడుతుంటే, హాలీవుడ్ టాలెంట్‌ను ‘నేషనల్ స్క్రీన్’కు లాక్కొస్తున్న జక్కన్నను గ్రేట్ అనాలి. జూ.ఎన్టీఆర్ కోసం ఎమ్మా రాబర్ట్స్ ఎంపిక చేసినట్టు వినిపిస్తోంది. విషయంలోకెళ్తే..
రాజవౌళి భారీ మల్టీ స్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ నుంచి కొంతకాలంగా ఎలాంటి సౌండ్ వినిపించటం లేదు. ప్రాజెక్టు పనులు సైలెంట్‌గా సాగిపోతున్నాయి. అయితే, ఖరారుకాని కథనమొకటి ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అది -జూ.ఎన్టీఆర్‌కు జోడీ దొరికిందని. ఇది కచ్చితంగా ఫ్యాన్స్‌లో జోష్ పెంచే సమాచారమే. సినిమాలో ఎన్టీఆర్ పెయిర్‌గా విదేశీ భామ అవసరమన్నది దర్శకుడు రాజవౌళి చెప్పిన మాటే. ఈ పాత్ర కోసం ఇంతకుముందు ఇంగ్లీష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, ఆరంభంలోనే వ్యక్తిగత కారణాలతో ఆమె ప్రాజెక్టునుంచి తప్పుకోవడంతో -వెతుకులాట మళ్లీ మొదలైంది. మధ్యలో బాలీవుడ్ భామలు పరిణీతి చోప్రా, శ్రద్ధాకఫూర్ పేర్లూ చర్చకొచ్చినా -జక్కన్న సంతృప్తిపడలేదు. తాజాగా ఎమ్మా రాబర్ట్స్‌ను ఫైనల్ చేశారన్న కథనం వినిపిస్తోంది. ఎమ్మా రాబర్ట్స్ ఓ ఇంగ్లీష్ నటి, గాయని. ‘అన్‌ఫ్యాబులస్’ టెలివిజన్ సిరీస్‌తో క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మా, ‘ఆక్వామెరైన్’, ‘వాలెంటైన్స్ డే’ చిత్రాల్లో బలమైన పాత్రలతో పాపులారిటీ సాధించింది. హాలీవుడ్‌లో మంచి ట్రాక్ రికార్డువున్న ఎమ్మాను, ఎన్టీఆర్ సరసన చూపించేందుకు జక్కన్న ఫిక్సయ్యాడన్నది ఇండస్ట్రీ టాక్. దీనికోసమే ఈమధ్య హాలీవుడ్ టూర్ వేసి, ఆమెతో నామమాత్రపు చర్చలు సాగించాడట. స్క్రీన్ టెస్ట్ సైతం అక్కడే ముగించాడని టాక్. ఎమ్మా కనుక ఎంపికైతే -ఆమెకిది తొలి భారతీయ చిత్రమవుతుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా జక్కన్న చెక్కుతోన్న పేట్రియాట్రిక్ డ్రామా -ట్రిపుల్ ఆర్. ఎన్టీఆర్, రామచరణ్‌లను కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యోధులిద్దరికి సంబంధించి చరిత్రకెక్కని కొత్త కోణాన్ని ‘్ఫంటసీ’గా చెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నది రాజవౌళి మాట. హీరో రామ్‌చరణ్ పెయిర్‌గా ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఎంపికైంది. జూ.ఎన్టీఆర్ కోసం తాజాగా ఎమ్మాను కన్ఫర్మ్ చేసుకున్నట్టు వినిపిస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం పెదవి విప్పడం లేదు. ఎమ్మాను ఎంపిక చేసినట్టు అధికారిక ప్రకటన వచ్చేవరకూ -మరిన్ని పేర్లు వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.