ఫోర్లు ఓకే.. సిక్సర్లకు టైముంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో యంగ్ సెనే్సషనల్ బ్యూటీ -రష్మిక మండన్న. ‘్ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి
పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ అందం. ‘గీతగోవిందం’ చిత్రంతో కెరీర్ గీతనే మార్చేసుకున్న రష్మిక -మరోసారి సెనే్సషనల్ హీరో విజయ్ దేవరకొండతో జోడీ కట్టింది. ఆ సినిమా -డియర్ కామ్రేడ్.
భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 26న థియేటర్లకు వస్తోన్న నేపథ్యంలో రష్మిక మీడియాతో ముచ్చటించింది.

..కామ్రేడ్ గురించి?
డియర్ కామ్రేడ్ భావోద్వేగాలతో సాగే మెస్సెజ్ ఓరియంటెడ్ కథ. ప్రతి ఒక్కరికీ కనెక్టవుతుంది. లిల్లీ (రష్మిక మండన్న), బాబి (విజయ్ దేవరకొండ) మధ్య సాగే జర్నీ సినిమాకు హైలెట్. లిల్లీగా స్టేట్ లెవెల్ క్రికెటర్ పాత్రలో కనిపిస్తా. బాబీ, లిల్లీలు లవ్‌లో పడిన తరువాత తలెత్తే పరిణామాలు? బాబీతో లిల్లీ సాగించే లైఫ్ అండ్ లవ్ జర్నీ. ఆడియన్స్‌కి సంతృప్తినిచ్చే ఎంటర్‌టైనింగ్ కంటెంట్ ఇది.
క్రికెటర్‌గా..
క్రికెట్ గురించి నాకేమీ తెలీదు. లిల్లీ పాత్ర కోసం జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నా. నా వికెట్ పడిపోకుండా మ్యానేజ్ చేయగల (నవ్వుతూ) నేర్పు వచ్చింది. అలాగని సిక్సర్లు బాదమంటే కష్టం. ఇప్పటికైతే ఫోర్‌లు చాలానే కొట్టాను.
భాషాపరంగా..
ఏ భాషలోనైనా డబ్బింగ్‌కు సన్నద్ధమవుతున్నా. ప్రస్తుతానికి కన్నడ, తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నా. తమిళం, మలయాళంలో వేరేవాళ్ల గొంతు వినిపిస్తుంది. ఆ రెండు భాషల్లోనూ సినిమాలు పడితే, ఆ భాషలు నేర్చుకుని డబ్బింగ్ చెప్పడానికి నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నా.
మహేశ్ సినిమాలో..
ఆ ప్రాజెక్టులో చాన్స్ లక్కీ అనుకోవడం లేదు. అవకాశాలు హార్డ్ వర్క్‌తోనే వస్తాయని గట్టిగా నమ్మే అమ్మాయిని. నా హార్డ్‌వర్క్‌తోనే అవకాశాలు వస్తున్నాయని నమ్ముతున్నా. ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ షెడ్యూల్‌లో నా పాత్రకి సంబంధించి ఎలాంటి చిత్రీకరణా లేదు. దాంతో మహేష్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం ఇంకా రాలేదు. తరువాతి షెడ్యూల్‌లో తనతో కలిసి చేయడానికి ఎగ్జైట్‌గా ఉన్నా. కాకపోతే, ఇప్పటికే మహేష్‌ను ఒకసారి కలిశా. హ్యాపీ అనిపించింది. తనదగ్గర ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది.
విజయ్ కోసం..
విజయ్ దేవరకొండ కోసమో, మరొకరి కోసమో ఈ సినిమా ఒప్పుకోలేదు. స్క్రిప్ట్ విన్నప్పుడే బాగా నచ్చింది. తరువాత ఏంజరుగుతుందన్న ఆకస్తి ప్రతి సన్నివేశంలో కనిపించింది. ఈ పాయింట్ బేస్ చేసుకునే ఒప్పుకున్నా. దర్శకుడు భరత్‌కి స్క్రిప్ట్‌పై ఫుల్ కమాండ్ ఉంది. మొదట ఆయన నాకు స్క్రిప్ట్ మెయిల్ చేశారు, కానీ చదవలేదు. తరువాత స్టోరీ చెప్పినపుడు బాగా నచ్చింది.
ప్రమోషన్స్ కోసం..
డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలామంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు. సినిమాకి ప్రమోషన్స్ ముఖ్యంకదా. హీరోయిన్‌గా ప్రమోషన్స్‌లోనూ నా బాధ్యత ఉంటుంది కనుక పాల్గొంటున్నా. నిజానికి క్రెడిట్ మాత్రం విజయ్, దర్శకుడిదే. ప్రమోషన్స్ మొత్తం వాళ్ల ప్రణాళికలే.
తరువాతి ప్రాజెక్టులు..?
తరువాతి సినిమాల విషయానికొస్తే -తమిళంలో కార్తి హీరోగా సినిమా ఉంటుంది. తెలుగులో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి.