స్మిత.. జర్నీ సెలబ్రేషన్ 22న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా ప్రయాణం ఇంకా కొత్తగానే అనిపిస్తోంది. ఏం తెలీకుండానే మ్యూజిక్, డ్యాన్స్‌లోకి అడుగుపెట్టాను. తెలుసుకోవడం మొదలెట్టాను. వెనక్కి తిరిగి చూస్తుంటే -20 ఏళ్ల ప్రయాణం సాగిపోయిందా? అనిపిస్తోంది అంటోంది పాప్ సింగర్ స్మిత. ప్రతి చిన్న విషయాన్నీ ఎంజాయ్ చేసే తన ప్రయాణం హాయిగా సాగిపోతోందని అంటోంది. తన 20ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ -జూలై 22న సెలబ్రేషన్ చేయనున్నట్టు ప్రకటించారు ఇండీపాప్ సింగర్ స్మిత. 1996లో ‘పాడుతా తీయగా’లో మైక్ పట్టుకున్నప్పటి నుంచీ ఇప్పటి వరకూ నాలో అదే ఉత్సాహం. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఇండీ పాప్ అయినందుకు గర్వపడుతున్నా. పదికంటే ఎక్కువ భాషల్లో పాడాను. 12 ఆల్బమ్‌లు, 17 మ్యూజికల్ వీడియోలు చేశాను. 100కుపైగా ప్లేబ్యాక్స్, 8 దేశాల్లో 200కు పైగా కన్సర్ట్స్.. అవార్డులు, ట్రోఫీలు.. ఇదంతా నేనేనా అనిపిస్తోంది. జూలై 22న 20ఏళ్ల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తున్నా. గాయనిగా ఈ ప్రయాణానికి కారకులైన ప్రతి ఒక్కర్నీ జూలై 22న హైదరాబాద్‌లో నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో గుర్తు చేసుకుంటా అంటోంది స్మిత.