‘శివశంకరీ.. సాహసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగర్ అనుదీప్ చేసిన ‘శివశంకరీ’ ఫ్యూజన్‌లో విజువల్స్, ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు సంగీత దర్శకుడు కోటి. ఫ్యూజన్ కవర్ సాంగ్ లాంచ్ చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ -గొప్ప సంగీత దర్శకుడు పెండ్యాల కంపోజిషన్‌లో ఘంటసాల ఆలపించిన పాటను మోడ్రన్ ఫ్యూజన్‌గా ప్రజెంట్ చేయటంలో క్రియేటివిటీ కనిపిస్తోందన్నారు. మాతృకలోని ఆత్మ ఏమాత్రం దెబ్బతినకుండా అనుదీప్ జాగ్రత్తలు తీసుకోవటం ఆ పాటపట్ల అతనికున్న గౌరవాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. ‘శివశంకరీ’ ఫ్యూజన్‌తో అనుదీప్‌కు మంచి పేరు రావాలని ఆశీర్వదించారు. సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ మాట్లాడుతూ పాటలోని సోల్ దెబ్బతినకుండా రీమిక్స్ సాహసానికి ఒడిగట్టిన అనుదీప్ అభినందనీయుడు అన్నారు. సింగర్ అనుదీప్ మాట్లాడుతూ -ఏదైనా మంచి కవర్ సాంగ్ చేయాలన్న ఆలోచనలకు ‘శివశంకరీ’ తట్టిందని, ఆట సందీప్ కొరియోగ్రఫీ అందించారన్నారు. తనను ఆశీర్వదించి ప్రోత్సహిస్తోన్న పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.