మళ్లీ.. ఐష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బింగ్ కూడా చెప్పేయడంతో సైరా ప్రాజెక్టు నుంచి ఫ్రీ అయిపోయాడు సీనియర్ హీరో చిరంజీవి. చిరు తరువాతి ప్రాజెక్టుని తెరకెక్కించేందుకు సిద్ధమైపోతున్నాడు కొరటాల శివ. 152వ ప్రాజెక్టు నిర్మాణానికి పెద్దఎత్తున సన్నాహలూ జరిగిపోతున్నాయి. అయితే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో చిరు సరసన కనిపించేదెవరు? అన్న ప్రశ్న చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. చిరు సరసన అన్ని విధాలా సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతో సైరాలో నయనతారను తీసుకున్నారు. తదుపరి ప్రాజెక్టులోనూ ఆమెకే అవకాశం ఇవ్వొచ్చన్న కథనాలూ వినిపించాయి. తరువాత -చిరుకి కాంబినేషన్‌గా బాలీవుడ్ బ్యూటీని చూస్తున్నారంటూ కొంతకాలం క్రితం ఐశ్వర్యరాయ్ పేరు వినిపించింది. తరువాత అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఐశ్వర్యారాయ్ పేరే వినిపిస్తోంది. హీరోయిన్‌గా ఐష్ ఎంపికపై చిత్రబృందం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.