కామ్రేడ్.. ప్రేమ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చినపుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ.. వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది -అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ఎమోషనల్ పెయిన్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్ -డియర్ కామ్రేడ్ చిత్రంలోది. ఫ్యాన్స్ ఎదురు చూపుల్ని సంతృప్తిపర్చేలా ప్రకటించిన సమయానికే ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ బయటికొచ్చింది. ఒకవైపు కాలేజ్ పాలిటిక్స్, మరోవైపు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌తో క్యూట్ లవ్ స్టోరీ కంటెంట్‌ను దర్శకుడు ట్రైలర్‌లో చూపించాడు. కాలేజ్‌లో రాజకీయాలను వ్యతిరేకిస్తూ బాబీ కృష్ణ (విజయ్) విద్యార్థులతో చేపట్టిన ఆందోళన, స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్‌గా ఎదిగిన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ లిల్లీ (రష్మిక మండన్న)తో క్యూట్ లవ్.. ఈ లేయర్లను ట్రైలర్‌తో టేస్ట్ చూపించాడు. ప్రేమ విఫలమైన మూడేళ్లలో కామ్రేడ్ లైఫ్‌లో ఏం జరిగిందన్నదే అసలు కథ. ప్రేమికుల మధ్య ఎడబాటుకు కారణం? హీరో జీవితంపై దాని ప్రభావం? విపత్కర పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్న కానె్సప్ట్‌లో కథ సాగేలా కనిపిస్తోంది. దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ చిత్రంతో రెండోసారి విజయ్‌తో జోడీకట్టింది రష్మిక మండన్న. ‘హృదయం ఊగెలే..’ అంటూ జనాన్ని ఊపేస్తోన్న హిట్ సాంగ్‌నే ట్రైలర్‌లోనూ వినిపించారు. ఆమెను పడేయడం చాలా కష్టమన్న విషయాన్ని రష్మిక స్నేహితులకు విజయ్ చెబుతూ -‘కైసీ కర్తీ ఇస్సే దోస్తీ.. చాలా కష్ట్ హై’ అని వచ్చిరాని హిందీలో చెప్పిన డైలాగ్ తీరు బావుంది. మొత్తంగా హీరో లవ్ క్రైసిస్, కోపం, లిప్‌లాక్‌లు, బ్రేకప్‌ల సీక్వెన్స్‌లు చూస్తుంటే -ఇంతకుముందు విజయ్ చేసిన సినిమాల షేడ్స్‌లోనే ఇదీ ఉండబోతోందన్న విషయం అర్థమైంది. కాకపోతే -కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కనుక ఫ్లేవర్ వేరు కావొచ్చు.