2న వస్తున్నరాక్షసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నొచ్చిన ‘సీత’లో అమాయక రాముడిగా హీరోయిజం చూపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ -తాజా ప్రాజెక్టులో ‘రాక్షసుడు’ అవతారం ఎత్తుతున్నాడు. దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్లకు రానున్నట్టు చిత్రబృందం పోస్టర్ వేసి మరీ ప్రకటించింది. శ్రీనివాస్‌తో అనుపమ పరమేశ్వరన్ జోడీ కట్టింది. గతేడాది తమిళంలో విష్ణువిశాల్, అమలాపాల్ జోడీగా వచ్చిన ‘రాచ్చసన్’ హిట్టు చిత్రానికి ఇది రీమేక్. జిబ్రాన్ సంగీతం సమకూర్చిన సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. సరైన హిట్టుకోసం ఆశగా ఎదరు చూస్తున్న శ్రీనివాస్‌కు -ఈ రీమేక్ కొత్త ఉత్సాహం తెస్తుందేమో చూడాలి.