ఆమె ప్రపంచం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడెలా ప్రవర్తించాలి.. ఎక్కడేం ప్రదర్శించాలో బాగా తెలిసిన బేబీ -శామ్. ఈవెంట్ తగిన డ్రెస్సింగ్‌తో మెప్పించగలదు. అదనుచూసి రహస్యాన్ని బయటపెట్టి భేష్ అనిపించుకోగలదు. అందుకే -టాప్ హీరోయిన్ల జాబితాలో పెళ్లయిన తరువాత కూడా తనకున్న సెపరేట్ క్రేజ్‌ని కంటిన్యూ చేయగలుగుతుంది సమంత. వారం క్రితం ‘ఓ బేబీ’నంటూ థియేటర్లకు వచ్చిన సమంత -సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌మీదుంది. డీసెంట్ క్లాసిక్‌తో హిట్టందుకున్న సమంత -శాంతి కపోతంలా శే్వతవర్ణపు దుస్తుల్లో సక్సెస్ మీట్‌లో ధగధగలాడింది. ఇదే టైం అనుకుందో ఏమో.. చాలాకాలంగా మనసులో దాచుకున్న సీక్రెట్‌ను శరీరంపై చూపించి అబ్బురపర్చింది. కుడివైపు పక్కటెముకల మీద వేయించుకున్న టాటూ బయటపడేలా ఫోజులిచ్చి -్భర్త నాగచైతన్య అంటే ఎంత ప్రేమో సెలబ్రిటీ స్టయిల్లో చెప్పకనే చెప్పింది. ‘ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నా. ఇప్పటి వరకూ దాచిపెట్టిన టాటూ సీక్రెట్‌నీ చెప్పకనే చెప్పేశా. చైతూ నా భర్త. నా ప్రపంచం’ అంటూ లవ్ క్యాప్షన్ పోస్ట్ చేసి పాజిటివ్ మార్కులు కొట్టేసింది సామ్. కొనేళ్ల క్రితం చైతూ, సామ్ ముంచేతిపై ఒకేరకం టాటూ వేయించుకోవడం తెలిసిందే.