ఎవరు.. ఇతగాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడివి శేష్. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ అనుభవాన్ని సంపాదించాడు. విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలు చేస్తూ తోటి హీరోల్లో తన ట్రాక్ సెపరేట్ అని ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. మొన్నటి క్షణం, నిన్నటి గూఢచారితో మంచి క్రేజ్ తెచ్చుకున్న శేష్ చేస్తున్న తాజా ప్రాజెక్టు -ఎవరు? దర్శకుడు రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించి తాజాగా ప్రీలుక్ వదిలాడు. ఈనెల 11న ఫస్ట్‌లుక్ విడుదల చేస్తామంటూ ప్రకటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న చిత్రంలో శేష్ సరసన రెజీనా కనిపించనుంది. కొంతకాలంగా హీరోయిన్ల రేసులో వెనుకపడిన రెజీనా -ఈ సినిమాపై నమ్మకంతో ఉంది. ఈ సినిమా నుంచి జోరు పెంచే ఆలోచనలోనూ ఉందట. అడివి శేష్ -రెజీనా కెరీర్‌ను గాడిలో పెడతాడేమో చూడాలి.