నాకిది గుడ్ స్టార్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరి రెండో కొడుకు మేఘాంశ్ హీరోగా వస్తోన్న చిత్రం -రాజ్‌దూత్. అర్జున్, కార్తీక్‌ల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి నిర్మాత సత్తిబాబు. నక్షత్ర హీరోయిన్. సినిమా 12న విడుదలవుతోన్న సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు మేఘాంశ్. ‘ఇది నా మొదటి సినిమా. మండుటెండల్లో యూనిట్ మొత్తం కష్టపడ్డాం. బడ్జెట్ విషయంలో నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. వత్తిడిని తగ్గించుకోడానికి సినిమా చివరికొచ్చే వరకూ ప్రచారం విషయంలో కామ్‌గా ఉన్నాం. పుట్టి పెరిగిందంతా పరిశ్రమ వాతావరణంలోనే కనుక, సినిమాపై ఫ్యాషన్ ఉంది. దీనికితోడు నాన్న కోరికా నేను హీరో అవ్వాలనే. స్కూల్ ఏజ్‌నుంచే థియేటర్ డ్రామాలో చేశాను. సినిమాకు ముందు కొంత శిక్షణ కూడా తీసుకున్నా. తనకిష్టమైన దానికోసం బైక్‌పై వెతికే హీరో కథ కనుక -రాజ్‌ధూత్ టైటిల్ పెట్టాం. ఇది థ్రిల్లర్ కాదు, రోడ్ జర్నీ కమర్షియల్ మూవీ. నేను హీరో అవ్వడంతో అమ్మ హ్యాపీ. నాన్న నటనలోని ప్రతి కోణం నాకిష్టమే. సుధీర్ వర్మ దగ్గర పని చేసిన అర్జున్ -కార్తీక్‌ల మధ్య కోఆర్టినేషన్ బావుంటుంది. విబేధాలకు తావివ్వకుండా సినిమా పూర్తి చేయడం హ్యాపీగా ఉంది’ అన్నాడు.