1500 కోట్లతో రామాయణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరియు టాలీవుడ్‌లో క్రేజీ ప్రొడక్షన్ హౌస్‌గా ముద్రవేసుకున్న నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ బ్యానర్‌పై నమిత మల్హోత్ర సంయుక్తంగా 1500 కోట్లకి పైగా చారిత్రాత్మకంగా భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ్‌ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. గజిని వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మించిన తెలుగువాడు మధు మంతెన ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దంగల్ లాంటి అత్యద్భుతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన నితేష్ తివారి మరియు మామ్ లాంటి సెన్సిటివ్ బ్లాక్‌బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రవి ఉద్యావర్‌లు సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో మూడుభాగాలుగా నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో భాగాన్ని 500 కోట్లకి పైగా బడ్జెట్‌తో నిర్మిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక పాన్ ఇండియా నుంచి ఎంచుకుంటారు. సౌత్ నిర్మాణ సంస్థల్లో గీతాఆర్ట్స్ ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించటం ఇదే ప్రథమం. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుండి మొదలవుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ మరియు బాలీవుడ్‌లో ప్రైమ్ ఫోకస్ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మాణం చేపడుతున్నారు. డబుల్ నెగెటివ్ వి ఎఫ్ ఎక్స్ కంపెనీకి గతంలో 4గ్రాఫిక్ విభాగానికి ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఈ కంపెనీ ప్రైమ్‌ఫోకస్‌లో ఒక భాగమే. ఇప్పుడు విఎఫ్‌ఎక్స్‌కి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రపంచస్థాయి విలువలు కనిపించేలా ఈ రామాయణ్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ మరియు నమిత్ మల్హోత్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ అపురూప కావ్యాన్ని తెరకెక్కించే పూర్తి బాధ్యతని నితీష్ తివారి, రవి ఉద్యావర్‌లు తీసుకున్నారు. ఇలాంటి చరిత్రాత్మక చిత్రాన్ని మూడు భాషల్లో మూడు భాగాలుగా తెరకెక్కిస్తారట.