విష్ణు మంచు.. వెరీ బిజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు, నిర్మాత విష్ణు మంచు పెద్ద రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని మూడు యాక్షన్ డ్రామా చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరిస్‌ను రూపొందించనున్నారు. ఇందులో ఓ హాలీవుడ్ చిత్రం కూడా వుంది. అందులో భాగంగా రెండు చిత్రాలు, వెబ్ సిరీస్‌ను ఆదివారం తన ప్రొడక్షన్ ఆఫీసులో లాంఛనంగా ప్రారంభించారు. విష్ణు, కాజల్ జంటగా ఓ యాక్షన్ డ్రామా ముందుగా రూపొందనుంది. ఇండియాలో ఐటీ రంగాన్ని ఆధారంగా చేసుకుని ఓ నిజ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. సుబ్బరాజు అనే కొత్త దర్శకుడితో న్యూఏజ్ థ్రిల్లర్ మూవీని నిర్మించనున్నారు మంచు విష్ణు. ఈ చిత్రానికి ‘మిరా రోడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది కూడా నిజ ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలో విడుదల చేయనున్నారు. అలాగే మంచు విష్ణు తొలిసారి హాలీవుడ్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. జెఫ్రె చిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. వయామార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. అలాగే నిజ ఘటనలను ఆధారంగా చేసకుని పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్‌ను విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు డైలాగ్స్, స్క్రీన్‌ప్లే పరుచూరి గోపాలకృష్ణ సమకూరుస్తున్నారు.