వచ్చేనెలలో గిటార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమాపతి, రేష్మా జంటగా ఆర్.ఇన్బా శేఖర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన గిటార్ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదించారు. ఐ మిస్ యు అనేది ఉపశీర్షిక. ఎంఆర్‌ఆర్ మూవీస్ బ్యానర్‌పై వానపల్లి బ్రహ్మాజీ సమర్పణలో ఎం.రవిశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతల మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్ల ట్రైలర్ విడుదల అనంతరం మాట్లాడుతూ- ప్రేమకథా చిత్రాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే వుంటారు. ఆ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అన్నారు. వానపల్లి బ్రహ్మాజీ మాట్లాడుతూ- హీరో గిటార్ వాద్యకారుడు. ప్రాణంతో సమానంగా చూసుకునే గిటార్ ఓ దుర్ఘటనలో మిస్ అవుతాడు. ఆ తరువాత జరిగే పరిణామాలే ఈ చిత్రం. అందరికీ థ్రిల్లింగ్ అనిపిస్తుంది అన్నారు. నిర్మాత రవిశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ- తెలుగమ్మాయి రేష్మా కథానాయికగా చక్కటి నటనను కనబర్చింది. అలాగే హీరో ఉమాపతి మంచి ఇమేజ్ తెచ్చుకుంటాడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో నాలుగు పాటలుంటాయి. త్వరలో ఆడియో విడుదల చేసి వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.