టీజర్‌లో రాజావారు రాణిగారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.మనోవికాస్ నిర్మిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’. రవికిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బావర్మ, రహస్య గోరక్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంచ్ చేయగా విలేకరుల సమావేశంలో.. ప్రొడ్యూసర్ డి.మనోవికాస్ మాట్లాడుతూ.. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. డైరెక్టర్ రవి కూడా ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు. సెట్స్‌లో ఏ ప్రాబ్లమ్ లేకుండా చాలా చక్కగా అవుట్‌పుట్ ఇచ్చారు. కథ విన్నాక బాగానచ్చి నేనే ప్రొడ్యూస్ చేశాను. హీరో కూడా చాలాబాగా చేశారు. హీరోయిన్ కూడా బాగా కష్టపడింది. నాకు ఈ సినిమాతో ఒక మంచి సిస్టర్‌లా అయిపోయింది. సినిమా యూనిట్ అంతా బాగాచేశారు. దర్శకుడు రవి మాట్లాడుతూ.. మీ అందరికీ టీజర్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ మూవీ మీ అందరికి ఒక ఫ్రెష్ అనుభవాన్ని ఇస్తుంది అని అన్నారు. హీరో మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను రెండు వెబ్‌సిరీస్‌లో చేశాను. అప్పుడు కొంచెం టెన్షన్ ఉండేది కాని ఇప్పుడు అది లేదు. మాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా రెండుమూడు నెలల్లో విడుదలవుతుంది. మూవీ చాలాబాగా వచ్చింది. టీమ్ అందరం బాగా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్యకారణం మా ప్రొడ్యూసర్‌గారి ఫాదర్. ఆయన చాలా మంచి సపోర్ట్‌ఇచ్చారు. థాంక్యూ వెరీమచ్ అంకుల్.