సరికొత్త సవారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, ప్రియాంక శర్మ జోడీగా సాహిత్ మోత్కూరి తెరకెక్కిస్తోన్న చిత్రం -సవారి. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ -ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు చేసినా సవారి చిత్రం తన కెరీర్‌లో బెస్ట్ అని భావిస్తున్నానన్నారు. దర్శకుడు సాహిత్ స్క్రీన్‌పై కథను చెప్పే విధానం కొత్తగా అనిపించిందని, నిర్మాతలు సంతోష్ మోత్కురి, నిశాంక్‌రెడ్డి కుడితి ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మిస్తున్నారన్నారు. తన బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ సినిమాకు కరెక్ట్‌గా సెట్టయ్యానని, త్వరలో ట్రైలర్ విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ -తెలుగు సినిమాల్లో కొత్త కథలు వస్తున్నాయి. దర్శకుడు సాహిత్ ఎంచుకున్న కథ వైవిధ్యంగా ఉంది. దాన్ని తెరపై బాగా చూపిస్తాడన్న నమ్మకముంది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్నా అన్నారు. సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర మాట్లాడుతూ -కథ విన్నప్పుడే నచ్చింది. సాహిత్ టాలెంట్‌వున్న దర్శకుడు. నిర్మాణ విలువలు చూస్తుంటే, నిర్మాతల గట్స్ కనిపిస్తోంది. పాటలు బాగావచ్చాయి. త్వరలో సాంగ్స్ విడుదల చేస్తాం అన్నారు. దర్శకుడు సాహిత్ మాట్లాడుతూ -సినిమా కోసం నందు సహా అంతా ప్రాణం పెట్టారని, విజయంపై నమ్మకంతో ఉన్నామన్నారు. హీరోయిన్ ప్రియాంకశర్మ మాట్లాడుతూ -నందు మంచి నటుడు. షూటింగ్ టైంలో ఎంతగానో సపోర్ట్ చేశాడు. నామీద నమ్మకంతో సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ ఇచ్చినందుకు దర్శకుడు సాహిత్‌కు కృతజ్ఞతలు. టీజర్ మాదిరిగానే సినిమా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు.