ప్రేక్షకులకు నచ్చేలా కెఎస్100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడలింగ్ స్టార్స్ సమీర్‌ఖాన్, సునీతాపాండే, శైలజాతివారి, ఆశిరాయ్, శ్రద్ధావర్మ, అక్షిత మాధవ్ హీరో హీరోయిన్లుగా షేర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెఎస్100. 12న సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో నిర్మాత కె వెంకట్‌రామ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కెఎస్100 రొమాంటిక్ హారర్‌గానే కాకుండా, ఎమోషన్ కంటెంట్‌తో తెరకెక్కించామన్నారు. కెఎస్ అంటే కుమార్, స్వామి అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ, వారి జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనల కారణంగా ఫ్రెండ్‌షిప్ మాయమై శత్రువులవుతారని.. ఎందుకు? అన్నదే అసలు సినిమా అన్నారు. దర్శకుడు షేర్ ఎంతో ఫ్యాషన్‌తో అనుకున్న బడ్జెట్‌లో సినిమా తెరకెక్కించారని, బిజినెస్ బాగుందన్నారు. మంచి కంటెంట్ స్టోరీ కనుక ఫ్రెష్‌నెస్ కోసం మోడల్స్‌ని ఎంపిక చేసుకున్నామన్నారు. తరువాతి ప్రాజెక్టును సైతం షేర్‌తోనే ప్లాన్ చేస్తున్నామని, ‘ది డైమండ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తామన్నారు. వచ్చే నెలనుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామన్నారు.