వైవిధ్యంపైనే నా ఫోకస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడియన్స్ మెచ్చే వైవిధ్యమైన చిత్రాలు నిర్మించాలని ఉందంటున్నాడు -ఎస్‌కెఎన్. ఆమధ్య విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన టాక్సీవాలా మంచి విజయం సాధించటంతో, ఆ ఉత్సాహంలో మరిన్ని చిత్రాల నిర్మాణానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు. గీత ఆర్ట్స్-2 బ్యానర్‌పై నిర్మాత బన్నీవాసుతో కలిసి సాయితేజ్ హీరోగా ఎస్‌కెఎన్ నిర్మిస్తోన్న తాజా చిత్రం -ప్రతిరోజూ పండగే. బర్త్‌డే సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికలపై మీడియాతో ముచ్చటించారు. జర్నలిస్టుగా కెరీర్ మొదలైంది. పదిహేనేళ్ళ క్రితం ఏలూరులో సినిమాలు చూసి -సమీక్షలను వెబ్‌లో పోస్ట్ పెట్టేవాడిని. ఆక్రమంలో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ దొరికడం, అల్లు శిరీష్‌తో పరిచయం జరిగాయి. తరువాత మెగా ఫ్యామిలీ సినిమాలకు పీఆర్వోగా చేస్తున్నా. ఒక్కోమెట్టు ఎక్కుతూ నిర్మాతగా మారుతితో కలిసి చేసిన తొలి ప్రయత్నం -ఈరోజుల్లో. ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలాతో మరో ఘన విజయం అందుకున్నా. ఇపుడు మారుతి దర్శకత్వంలో -ప్రతిరోజూ పండగ చేస్తున్నాం. ప్రస్తుతం తెలుగు సినిమాస్థాయి మారింది. మంచి సినిమాలు తీసి నిర్మాతగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది అన్నారు.