మరింత కష్టపడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ -విజయం సాధించాడు. సినిమా టీం ఒక్కటే కాదు, తెరవెనుక నుంచి ‘ఏజెంట్’ను ప్రోత్సహించిన వాళ్లెందరో ఉన్నారు. ఈ విజయాన్ని వృధాపోనివ్వను. మరింత కష్టంతో ఆడియన్స్ అభిమానాన్ని గెలుచుకుంటా -అన్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతిశర్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం -ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. రాహుల్‌యాదవ్ నక్కా నిర్మించిన చిత్రానికి స్వరూప్ రాజ్ దర్శకుడు. సినిమాకు మంచి టాక్ రావడంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
కార్యక్రమంలో హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ -రెండేళ్ల కష్టానికి తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరాభిమానాలు వరంలా భావిస్తున్నామన్నారు. సినిమా విజయాన్ని కొత్త ప్రయాణంలా భావిస్తున్నానని, మరింత కష్టపడతానన్నారు. దర్శకుడు స్వరూప్ రాజ్ మాట్లాడుతూ -టీం లేకపోతే సినిమా చేయగలిగేవాడిని కాదని, నవీన్‌తో సినిమా చేయాలనే ఈ కథ రాసుకున్నానన్నారు. సీక్వెల్ ఉంటుందా? అని చాలామంది అడిగారని, అయితే తామున్నంత కాలం ఈ చిత్రానికి ప్రాంచైజీ వస్తూనే ఉంటుందన్నారు. నిర్మాత రాహుల్‌యాదవ్ నక్కా మాట్లాడుతూ -ఐపీఎస్ సాధించాలన్న కల నెరవేరకపోవడంతో నిర్మాతగా కెరీర్ మొదలెట్టానన్నారు. తొలి అడుగే బలంగా పడిన ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్నారు. థియేటర్ల కోసం వెళ్లినపుడు అవమానకరమైన వ్యాఖ్యలు సైతం ఎదుర్కొన్నామని, అయితే ధైర్యంగా అడుగు ముందుకేసి విజయం సాధించామన్నారు. సినిమాకు పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సన్ని, సంగీత దర్శకుడు మార్క్‌కె రాబిన్, వివిధ విభాగాలకు చెందిన చిత్రబృందం సినిమా విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.