సైకో వైబ్రేషన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహో ఫీస్ట్ ఎంత రుచిగా ఉండబోతుందో ఫస్ట్‌సాంగ్ టీజర్‌తో రుచి చూపించింది చిత్రబృందం. బాహుబలి కంక్లూజన్ తరువాత హీరోప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ -సాహో. ప్రారంభం నుంచే ఓ రేంజ్ ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్న చిత్రబృందం -రకరకాల విన్యాసాల అనంతరం ఫస్ట్‌సాంగ్ టీజర్‌నూ బటయకు వదిలింది. సాహో ఫీస్ట్‌లోని అట్రాక్షన్ ఎలిమెంట్స్‌ను కొద్దికొద్దిగా రుచి చూపిస్తుండటంతో -చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 300 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. రెండు రోజులుగా ఫ్యాన్స్‌ను ఊరిస్తూ వచ్చిన సాహో టీం -తాజాగా ‘సైకో సయాన్’ సాంగ్ టీజర్‌ను వదిలింది. ప్రభాస్ హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధకఫూర్ హస్కీ డ్యాన్స్ బిట్ అట్రాక్టివ్‌గా ఉంది. పూర్తి పాట వీడియోను జూలై 8న విడుదల చేస్తారట. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఈనెల 15న సినిమా విడుదల కానుంది.