ఎవరికీ చెప్పొద్దు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోల సినిమాలే కాదు మంచి కథాబలమున్న సినిమాలకూ ప్రాధాన్యమిచ్చే నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. చిన్న సినిమాలకు, కొత్త దర్శకులకు, యంగ్ టాలెంట్‌కు ఆయన అందించే సపోర్టే ఆయన్ను టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఇపుడు మరో లవ్‌స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు దిల్‌రాజు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం -ఎవరికీ చెప్పొద్దు. చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆగస్టులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత రాకెశ్ వర్రె మాట్లాడుతూ- సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. దిల్‌రాజు మా సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.