మంచోడు కళ్యాణ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కళ్యాణ్‌రామ్ తాజా ప్రాజెక్టు టైటిల్ -ఎంత మంచివాడవురా. టైటిల్‌తోనే కంటెంట్ ఫ్లేవర్‌ను చెప్పకనే చెప్తున్నాడు దర్శకుడు వేగేశ్న సతీష్. ఎమోషనల్ మూడ్‌తో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించటంలో తన ప్రతిభను చూపిస్తోన్న సతీష్ -చిత్రమైన టైటిల్‌ను ఎంపిక చేసుకుని ప్రాజెక్టుపై ఆసక్తి పెంచాడు. ఈ ప్రాజెక్టులో కళ్యాణ్ సరసన మెహరీన్ కనిపించనుంది. ఇటీవలే షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. శుక్రవారం కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ లోగోను ఆవిష్కరిస్తూ -వర్షంలో తడుస్తోన్న ఇద్దరు చిన్నారులకు మొక్కజొన్న కండె కొనిచ్చి సైకిల్‌పై వెళ్తున్న కళ్యాణ్ మూమెంట్‌పై -‘ఎంత మంచివాడవురా’ అంటూ అక్కినేని ‘నమ్మినబంటు’ చిత్రంలోని పాటను ప్రజెంట్ చేస్తూ టైటిల్ టీజర్ విడుదల చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రమిది. గోపీ సుందర్ సంగీత దర్శకుడు.