హారర్.. టు యాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం, అభినయం, చిలిపితనంతో ఆకట్టుకున్న త్రిష -తరువాత ఆడియన్స్‌ను భయపెట్టడానికి హారర్ చిత్రాలతో గట్టిగానే ప్రయత్నించింది. తాజాగా యాక్షన్ రాణి అవతారం ఎత్తబోతోందట. ఇటీవలి కాలంలో కథానాయిక ప్రాధాన్యతా చిత్రాల్లోనే త్రిష కనిపిస్తోది. తాజాగా తమిళంలో ఈ బ్యూటీ చేస్తోన్న ప్రాజెక్టు -‘గర్జనై’. దర్శకుడు సుందర్ బాలు తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు బాలు ప్రాజెక్టుకు సంబంధించి థ్రెడ్‌ను వివరిస్తూ -చేయని తప్పుకు శిక్ష అనుభవించలేం. అలాంటి పరిస్థితే ఎదురైతే వచ్చే కోపమే -గర్జనై అంటున్నాడు. ఒక్క రాత్రిలో జరిగే కథాంశంతో సినిమా రూపొందించారట. వెస్ట్రన్ డ్యాన్సర్ పాత్ర పోషిస్తోన్న త్రిషకు -ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. కొత్త జానర్‌ను ఎంజాయ్ చేస్తూనే అదరగొట్టేసిందని చిత్రబృందం చెబుతోంది. సినిమాలో వైవిధ్యమైన గెటప్పుల్లో కనిపించే త్రిషను పోల్చుకోవడమే కష్టమన్న టాక్ వినిపిస్తోంది.