స్వీటీ.. అలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్‌చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న చిత్రం కూడా. సుదీర్ఘ షూటింగ్‌ను పూర్తి చేసిన దర్శకుడు సురేందర్‌రెడ్డి, నిర్మాణానంతర కార్యక్రమాలనూ వేగం చేశాడు. సినిమాలో అటు హిందీ, ఇటు తమిళ భాషలకు చెందిన ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. స్వీటీ అనుష్క సైతం సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న విషయం కొద్దిరోజుల క్రితమే బయటికొచ్చింది. కొత్త విషయం ఏంటంటే -ఝాన్సీలక్ష్మీబాయి పాత్ర పోషించబోతోందని. ఉయ్యాలవాడ కథకూ, ఝాన్సీ లక్ష్మీబాయి కథకు సంబంధమే లేకున్నా -వెరైటీ కోసం కథను ఆమెతో చెప్పిస్తున్నారని వినిపిస్తోంది. అంటే నరసింహారెడ్డి కథను లక్ష్మీబాయి పాత్రలోని అనుష్కతో చెప్పిస్తారన్న మాట. నమ్మశక్యంగా లేకపోయినా పరిశ్రమలో మాత్రం బలంగానే ఈ మాట వినిపిస్తోంది.