శౌర్య వచ్చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరా క్రియేషన్స్‌పై తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్‌లో గాయపడిన హీరో నాగశౌర్య -విశ్రాంతి అనంతరం మళ్లీ షూటింగ్‌లో జాయినయ్యాడు. షెడ్యూల్ అటూ ఇటూ అయితే ఆర్టిస్టుల డేట్స్ అడ్జెట్‌కాక నిర్మాత ఇబ్బందిపడాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో -విశ్రాంతికి తక్కువ టైం కేటాయించి షూటింగ్‌కు హాజరవ్వడంపట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతంలో మొదలైన షూటింగ్‌లో తొలి షాట్‌ను నాగశౌర్యమీదే చిత్రీకరించారు. ఐరా క్రియేషన్స్‌పై ఛలో తరువాత రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రమణ తేజ దర్శకుడు. ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా మెహరీన్ కనిపించనుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ నాగశౌర్య గాయపడ్డాడని తెలియగానే ఎంతో కలతపడ్డాం. అయితే, త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌కు హాజరుకావడం ఆనందంగా ఉంది. తాగాజా మొదలైన షెడ్యూల్ ఈనెల 20 వరకూ కొనసాగుతుంది. కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో పూర్తిచేస్తాం అన్నారు.