వీడో.. యముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ తాజా ప్రాజెక్టు -కడరం కొండాన్. తెలుగులో మిస్టర్ కేకేగా వస్తున్నాడు. ఈ సినిమా తమిళ వర్షన్ టీజర్‌ను కమల్‌హాసన్ విడుదల చేస్తే, తెలుగు వర్షన్ టీజర్‌ను అక్షర హాసన్ విడుదల చేసింది. నాజర్ కుమారుడు అబీ హస్సన్‌కు జోడీగా అక్షరహాసన్ ఈ చిత్రంలో కనిపించనుంది. తెలుగులో ఈ చిత్రానికి టి నరేష్‌కుమార్, టి శ్రీధర్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాజేశ్ సెల్వా తెరకెక్కించాడు. చిత్రంలో -్ఫన్లు చేసి మరీ మర్డర్లు చేస్తుంటాడు కెకె. ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానమే అసలు కథ. దాన్ని తెరపైనే చూడాలంటోంది చిత్రబృందం. విక్రమ్ సరికొత్త గెటప్ టెరిఫిక్‌గా ఉంటే, అందుకు తగ్గట్టే టీజర్‌లో విక్రమ్ ఒకరిని బెదిరించటం కనిపించింది. ‘నువ్వు ఆడుతున్నది నాతో కాదు, యముడితో’ అంటూ చియాన్ చెప్పిన చిన్న డైలాగ్ మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్‌గా హైలెట్ చేసింది. టీజర్ ముగింపులో -నా గురించి తెలియాలంటే ఇంకొంతసేపు వేచి ఉండాలి’ అన్న డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. రాజ్‌కమల్ ఫిలింస్‌పై కమల్ హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంలో నిర్మాతలు టి నరేష్‌కుమార్, శ్రీధర్‌లు మాట్లాడుతూ -విజయల్ గ్రాండియర్‌గా తెరకెక్కిన చిత్రం స్క్రీన్‌ప్లే ఎంత గ్రిప్పింగ్ ఉంటుందన్నది ట్రైలర్‌లోనే అర్థమవుతుంది. చియాన్‌కు ఏమాత్రం తగ్గకుండా అక్షరహాసన్ ఈ సినిమా పెర్ఫార్మెన్స్ చూపించింది. జిబ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది. సమర్థుడైన కమాండర్‌గా విక్రమ్ యాక్షన్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం ఖాయం అన్నారు.