గట్స్ గాళ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధైర్యం.. పరాజయం ఒకచోట ఉండవు. నేను ధైర్యవంతురాలిని -అంటోంది అమలాపాల్. కాలం కలిసిరాక కెరీర్‌పరంగాను, కటుంబపరంగాను కష్టాల్లో కూరుకుపోయిన అమల -నా బలం నాకు తెలుసు అంటూ తనకు తనే ధైర్యం చెప్పుకుంటోంది. ఆమధ్య దర్శకుడు ఏఎల్ విజయ్‌తో గొడవలు వచ్చి విడిపోయింది. అదే టైంలో ఆమెకు అవకాశాలూ దూరమయ్యాయి. చేతికందిన చాన్స్‌లూ జారిపోయాయి. అయినా అవిశ్రాంత పోరాటంతో ఆమె చిన్న బడ్జెట్ చిత్రాలకూ పరిమితమైంది. అమలాపాల్ చేస్తోన్న తాజా ప్రాజెక్టు -ఆడై. ఈ ప్రాజెక్టులో తప్పని పరిస్థితుల్లో శృతిమించిన సన్నివేశాలనూ -గట్స్‌తో చేసింది అమల. ఆమధ్య విజయ్ సేతుపతి చిత్రం నుంచి తప్పించటంతో ఆవేదనకు గురైన అమల, ఇప్పుడు ఏఎల్ విజయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వస్తుండటంతో కుంగుబాటుకు గురవుతోందట. ఎదురవుతున్న ప్రతికూల పరిణామాలను ‘ఆడై’ కథకు అన్వయిస్తూ సోషల్ మీడియాలో స్పందించింది. ‘జీవించడానికి పోరాడుతా. ధైర్యంతో సమస్యలను తరిమేస్తా. నా బలంపై నాకు నమ్మకముంది. స్వేచ్ఛ, సంతోషాలను దూరం చేసుకోను’ అంటూ. స్ట్రగుల్‌నుంచి రాటుదేలుతామన్న పెద్దల మాట -అమలాపాల్ జీవితంలో కనిపిస్తోంది.
ఇదిలావుంటే, థ్రిల్లర్‌గా వస్తోన్న ‘ఆమె’ 19న విడుదలవుతోంది. దర్శకుడ రతన్‌కుమార్ తెరకెక్కించిన చిత్రంలో -అమల బోల్డ్ లుక్ ఇప్పటికే సెనే్సషన్ సృష్టించింది. సినిమా తెలుగు హక్కులను తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. చరిత చిత్ర ప్రొడక్షన్స్‌లో ఆమె సినిమా విడుదలవుతోంది.