ముంబైలో ‘ఆగ్రహం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సుదీప్, సందీప్, రాజు, సుస్మిత హీరో హీరోయిన్లుగా ఆర్‌ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం -ఆగ్రహం. సందీప్ చెరుకూరి నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం టీజర్‌ను రాంగోపాల్‌వర్మ ముంబైలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సురేష్, నిర్మాత చెరుకూరి సందీప్, సంగీత దర్శకుడు రవిశంకర్ పాల్గొన్నారు. దర్శకుడు సురేష్ మాట్లాడుతూ -రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గ్యాంగ్‌స్టర్ కథ ఇది అన్నారు. ‘ఆఫీసర్, సర్కార్- 3 చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్‌ఆర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అన్నారు. చిత్ర నిర్మాత సందీప్ మాట్లాడుతూ -కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం అన్ని వర్గాలకు సంతృప్తి కలిగిస్తుందన్నారు. జూలైలో సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.