12న దొరసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జూలై 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. చిత్రంతో దర్శకుడిగా కెవిఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు. 80వ దశకంలో తెలంగాణలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తెస్తుంది చిత్ర బృందం. ఇప్పటికే టీజర్, లిరికల్ సాంగ్ ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’.. దొరసానిపై అంచనాలు పెంచాయి. తాజాగా ‘కలవరమై.. కలవరమై’ లిరికల్ వీడియో సైతం విడుదలైంది. కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని’కి ప్రత్యేక స్థానం ఖాయం అంటున్నారు దర్శకు నిర్మాతలు. చిత్రంలో కన్నడ కిశోర్, విజయ్‌వర్మ, ‘్ఫదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు.