మళ్లీ.. అమ్మగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త హీరోయిన్ల జోరు పెరుగుతుండటంతో సీనియర్ హీరోయిన్లు ఏదోక వైవిధ్యాన్ని వెతుక్కోక తప్పడం లేదు. వెండితెరపై సుదీర్ఘ కాలంపాటు కెరీర్ కొనసాగించి, టాప్ హీరోల సరసన వెలుగు వెలిగిన శ్రీయ -మహిళా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో శ్రీయ మంచి క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల వేగానికి వెనుకబడిన శ్రీయ, నాయికా ప్రాధాన్యత కలిగిన కథల వైపు మొగ్గు చూపుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా -వైవిధ్యమైన కథలను తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఓ ప్రాజెక్టుకు శ్రీయ సిద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల ఆయన వినిపించిన కథ శ్రీయకు నచ్చటంతో -వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తోంది. నాయికా ప్రాధాన్యత కలిగిన కథ నచ్చటంతో, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు శ్రీయ ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం. ఈ కథలో పదేళ్ల పాపకు తల్లిగా శ్రీయ కనిపించనుందట. గతంలో ‘గోపాల గోపాల’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాల్లో తల్లి పాత్రలతో శ్రీయ మెప్పించటం తెలిసిందే. నిజానికి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి నితిన్‌తో ప్రాజెక్టు కన్ఫర్మ్ అయ్యింది. అయితే, శ్రీయతో అనుకున్న ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి, తరువాతే నితిన్ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్తాడని అంటున్నారు.